టంగుటూరు : ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి ఆధ్వర్యంలో మాగుంట ట్రస్ట్ ద్వారా ఒంగోలు రిమ్స్ సహకారంతో స్థానిక అయ్యవారయ్య పొగాకు కంపెనీ ఆవరణలో శనివారం రక్తదాన శిబిరం జరిగింది. కరోనా కారణంగా లాక్ డౌన్ తో ప్రజలందరూ ఇండ్లకే పరిమితమైనందున కరోనా వైరస్ పాజిటివ్ రోగులు, ఇతర అనారోగ్యంతో వైద్యశాలలో చేరిన రోగులకు రక్త నిల్వలు సరిపోయినంత లేనందున ఎంతో మంది రోగుల ఇబ్బందులు పడుతున్నారు. వైద్యశాలల్లో రోగుల భవిష్యత్ అవసరాలను గ్రహించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తనయులు మాగుంట రాఘవరెడ్డి మానవత్వం నిండిన మనస్సుతో తమ మాగుంట రాఘవరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలోని మరిన్ని మండలాలలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తనిల్వలు సేకరించి రాష్ట్ర వైద్యశాఖకు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అయ్యవారయ్యతో పాటు 46మంది యువకులు రక్తదానం చేశారు.
ఈ రక్తదాన శిబిరంలో వైస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇంచార్జి, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, వైసిపి నాయకులు, టంగుటూరు సహకార సంఘ అధ్యక్షులు రావూరి అయ్యవారయ్య, ఎఎంసి వైస్ చైర్మన్ చింతపల్లి హరిబాబు, వైసిపి మండల అధ్యక్షులు సూదనగుంట హరిబాబు, కృష్ణారెడ్డి, పి సాగర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ పటాపంజుల కొటేశ్వరమ్మ, మాజీ సర్పంచ్ పుట్టా వెంకట్రావు, వైసీపీ నాయకులు తుల్లిబిల్లి అశోక్ బాబు, తేళ్ల డేవిడ్ రాజు, సూదనగుంట వెంకటస్వామి, పమిడి సుధీర్, ల్యాబ్ రమణయ్య, దండాల వినోద్, ప్రభుదాస్, రవీంద్ర, చిన వీరనారాయన, దాసరి సుబ్బారావు, అలెగ్జాండర్ పాల్గొన్నారు.