టంగుటూరు : కరోనా కారణంగా లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు తనవంతు చేయూతగా రూ.20వేల విలువ చేసే నాణ్యమైన బియ్యాన్ని ఒక్కొక్క జర్నలిస్టుకు 25కేజీల బస్తాను వైస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ లింగంగుంట రవిబాబు అందజేశారు.
ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ కరోనా కారణంగా గత మార్చి 22న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. దీంతో ఉపాధిలేక ఇబ్బంది పడుతున్నట్లే జీతభత్యాలులేని జర్నలిస్టులు కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు కొందరు జర్నలిస్టు మిత్రుల ద్వారా తెలుసుకుని అందజేస్తున్నట్లు చెప్పారు. కరోనా భయంతో అందరూ ఇండ్లల్లోనే ఉన్నప్పటికీ జర్నలిస్టులు మాత్రం సమాచార సేకరణలో నిరంతరం తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతగా తనవంతుగా బియ్యాన్ని అందిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇబ్బందులలో ఉన్న జర్నలిస్ట్ లను ఏ పార్టీ నాయకులు పట్టించుకోకున్నా రవిబాబు ముందుకు వచ్చి సహాయ పడటంతో మండలంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు.