Home ప్రకాశం సామాజిక దూరం పాటించడమే కరొనకు పరిష్కారం

సామాజిక దూరం పాటించడమే కరొనకు పరిష్కారం

252
0

టంగుటూరు : సింగరాయకొండ సిఐ యు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ 19 వైరస్ కు సామాజిక దూరం పాటించడమే విరుగుడని పేర్కొన్నారు. ప్రజలు ఎంతో చైతన్య వంతంగా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారన్నారు. తమ సిబ్బంది సహకారంతో గ్రామాలలోని ప్రజలు స్వచ్ఛందంగా ఇండ్లలోనే వుంటూ ‘లాక్ డౌన్’ ను పాటిస్తున్నారు. ఈ కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైనదన్నారు. ఒక వ్యక్తికి వస్తే ఆ వ్యక్తితో పోయేది కాదని చెప్పారు. వైరస్ సోకిన వ్యక్తి ద్వారా అందరికీ వస్తుందని పేర్కొన్నారు. కనుక ఒకరినుండి మరొకరికి చాలా త్వరగా వ్యాప్తి చెందే ఈ కరోనా వైరస్ ప్రమాదాన్ని గమనించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ‘లాక్ డౌన్’ ఉన్నన్ని రోజులు ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా పోలీసులతో సహాకరించాలని కోరారు. అవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటకు రావద్దన్నారు.

ఎవరైనా దాతలు కరోనా బాధితులకు భోజనం ప్యాకెట్లు, కూరగాయలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేయదలచుకున్న వారు ముందుగా జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకున్నాక పంపిణీ చేయాలని కోరారు. అనుమతి లేకుండా ప్రజలను గుంపులుగా ఒక చోట చేర్చి పంపిణీ కార్యక్రమాలు చేపట్టినచో అటువంటి వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కనుక నాయకులు, దాతలు పోలీసులతో సహకరించాలని కోరారు.