Home ప్రకాశం విజయనగర కాలనీలో విశ్రాంత ఉపాధ్యాయుని దాతృత్వం

విజయనగర కాలనీలో విశ్రాంత ఉపాధ్యాయుని దాతృత్వం

226
0

చీరాల : మండలంలోని విజయనగర్ కాలనీలో నివాసముంటున్న విశ్రాంత ఉపాధ్యాయుడు దాసరి రత్న రాజు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా వైరస్ కారణంగా షట్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన పేదలు గత కొద్ది రోజులుగా నిత్యావసరాలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని గ్రామంలో నివాసం ఉంటున్న విశ్రాంత ఉపాధ్యాయులు దాసరి రత్నరాజు గ్రామంలోని 600 కుటుంబాలకు ఆదివారం ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు.

గ్రామానికి చెందిన దుడ్డు సుందరరావు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కారణంగా ఇళ్లకే ప్రత్యేకమైన కాలనీవాసులకు ఉచితంగా కూరగాయలు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. తమ గ్రామాన్ని ఆనుకుని ఉన్న 50 కుటుంబాలు ఎస్టీలకు కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దుడ్డు వందనం, శేషయ్య, యాకోబు, చిలక పూర్ణ, వెంకటేశ్వర్లు, ప్రభాకర్ రావు పాల్గొన్నారు.