టంగుటూరు : కరోనా మహమ్మారి కారణంగా గత పదిహేను రోజుల నుండి ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధించిన లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమై ఉపాధి కోల్పోయిన పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందజేసిన రూ.వెయ్యి నగదును వైస్సార్ సీపీ మండల నాయకులు, టంగుటూరు సహకార పరపతి సంఘం అధ్యక్షులు రావూరి అయ్యవారయ్య ఆధ్వర్యంలో వైస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ ఇంచార్జి, పిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య చేతుల మీదుగా అందజేశారు. నగదుతోపాటు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగానే కరోనా బాధితులకు రూ.1000 నగదును మీ ఇంటికి తెచ్చి ఇవ్వడం ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనం అన్నారు. అనంతరం నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు.
కరోనా కారణంగా కష్టాల్లో ఉన్న గ్రామస్థులకు అండగా ఉండాలనే ఆలోచనతో వైస్సార్ సీపీ ఆధ్వర్యంలో రూ.4.80లక్షల విలువైన వంట నూనె ప్యాకెట్, ఉల్లిపాయలు, టమోటాలను కలిపి గ్రామంలోని 6వేల కుటుంబాలకు అందిస్తున్నామన్నారు. జగన్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతుల ప్రభుత్వం అన్నారు. గ్రామస్థులకు ఏ కష్టం వచ్చినా ఎల్లప్పుడూ అండగా వుంటామన్నారు. టంగుటూరు పంచాయతీ పరిధిలోని అన్ని కాలనీల ప్రజలకు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. కార్యక్రమంలో రావూరి అయ్యవారయ్య, వైస్సార్ సీపీ మండల అధ్యక్షులు సూదనగుంట హరిబాబు, చింతపల్లి హరిబాబు, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ చిడిపోతు సుబ్బారావు, మాజీ జడ్పీటీసీ పటాపంజుల కొటేశ్వరమ్మ, మాజీ సర్పంచ్ పుట్టా వెంకట్రావు, దేపూరి రమణయ్య, పమిడ్ సుధీర్ బాబు, సూదనగుంట వెంకస్వామి, తుల్లిబిల్లి అశోక్ బాబు, యారమాల నిరంజన్, కొమ్ము ప్రభుదాస్, తన్నీరు చినవీరనారాయణ, పమిడి హరికృష్ణ, బొడ్డు రవీంద్ర, కీర్తి వెంకటేష్, శిఖ సుబ్బారావు పాల్గొన్నారు.