చీరాల : కరోనా అత్యవసర పరిస్థితులలో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన పరిస్థితులపై ప్రభుత్వ అధికారులతో మునిసిపల్ కార్యాలయంలో శాసన సభ్యులు కరణం బలరామ కృష్ణమూర్తి సమీక్ష చేశారు. మునిసిపల్ కమీషనర్ రామచంద్రారెడ్డి, ఏరియా హాస్పిటల్ సుపరింటెండెంట్ తిరుపాలు, మెడికల్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ తిరుమలరావు, ఒకటవ, రెండవ పట్టణ సీఐలు నగమల్లేశ్వరరావు, ఫిరోజ్ తో చర్చించారు.
అధికారులతో ఎమ్మెల్యే బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ కరోనా అనుమానితులను వైద్య పరీక్షలకు కల్పించడంతోపాటు ప్రజలకు మనోధైర్యం కల్పించాల్సి ఉందన్నారు. లార్డ్ డౌన్ నేపద్యంలో ఇళ్లకే పరిమితమైన పేదలకు ఆహార సమస్య లేకుండా చూడాలన్నారు. నిత్యావసర సరుకులు అందించడంతోపాటు, యాచకులు, నిరుపేదలకు ఆహారం అందించాలని సూచించారు. సమావేశంలో యువనేత కరణం వెంకటేష్, మాజీమంత్రి డాక్టర్ పాలేటి రామారావు, వైసిపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వి అమృతపాణి, ఎఎంసి మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు, మల్లి రామకృష్ణ, దేవరపల్లి బాబురావు పాల్గొన్నారు.