Home ప్రకాశం ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటిద్దాం : కరణం వెంకటేష్

ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటిద్దాం : కరణం వెంకటేష్

380
0

– కరోనా నుండి చీరాలను రక్షించుకుందాం
– అందరూ ఇంటి వద్దనే ఉండాలని విన్నపం
– పోలీసులు, వాలంటరీలు, పారిశుద్ధ్య కార్మికుల పనితీరు బాగుంది
చీరాల : ప్రపంచ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న కరోనా నుండి ప్రజలను అప్రమత్తం చేయటంతో పాటు వారికి ఇబ్బందులు లేకుండ చూడాలని యువనేత కరణం వెంకటేష్, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, వైసీపీ రాష్త్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి, ఎఎంసి మాజీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మునిసిపల్ అధికారులకు సూచించారు. శనివారం మునిసిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, డీఇ ఏషయ్య, ఇతర అధికారులతో నాయకులు సమీక్ష నిర్వహించారు.

ఈసందర్భంగా యువనాయకులు కరణం వెంకటేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న ముందస్తు చర్యల నేపథ్యంలో మన రాష్ట్రంలో కరోనా పూర్తిగా నియంత్రణలో ఉందన్నారు. అయితే రాబోయే రోజులు అత్యంత కీలకమని తెలిపారు. దీనిని ప్రజలు అర్ధం చేసుకొని సహకరించాలని కోరారు. అధికారులు ఆవిధంగా ప్రజలను సన్నద్ధం చేయాలని చూచించారు. నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు ధరలు పెరగకుండా పర్యవేక్షణ చేయాలని చెప్పారు. కురగాయల కొనుగోలు వద్ద క్యూ పద్దతి తోపాటు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కితాబునిచ్చారు. వాలంటీర్లు, ఆశా కార్యకర్తలు, మునిసిపల్, పోలీసు ఇతర అత్యవసర శాఖల సిబ్బంది ఎంతో రిస్క్ తీసుకొని విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో పనిచేయాలని సూచించారు. ఏమాత్రం అలసత్వం వహించిన భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. అమెరికా, ఇటలీ వంటి అభివృద్ధి చెందిన దేశాలే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు.

ప్రజలు సామాజిక దూరం పాటించటంతోపాటు మొఖం తుడుచుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. చేతులు ఎప్పటి కప్పుడు శుభ్రం చేసుకోవటం తప్పనిసరి చేయాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ప్రజలకు ఎప్పటికపుడు అందజేస్తూ వారు వాటిని పాటించేలా చూడాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు తీసుకున్న జాగ్రత్తలు గురించి అధికారులు నాయకులకు వివరించారు.