చీరాల : లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో యెన్ఆర్ సి, సిఏఏ, ఎన్ పి ఆర్ లకు వ్యతిరేకంగా ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నట్లు ఎన్జీఓ ఆఫీస్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న సీపీఎం రాష్టకమిటీ సభ్యులు వై.సిద్దయ్య మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రమాదకరంగా ప్రజలమధ్య చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే రాజ్యాంగ విరుద్ధం అయిన యెన్ ఆర్సీ, సిఎఎ తీసుకు వచ్చిందని, దీనిని ప్రజలందరూ ఐక్యగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సమావేశంకి సీపీఐ కార్యదర్శి మేడా వెంకట్రావు, సీపీఎం కార్యదర్శి నలతోటి బాబూరావు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. కార్యక్రమంలో మాచర్ల మోహన్ రావు, గోసాల ఆశీర్వాదం, బెజ్జం విజయ్ కుమార్, అబ్దుల్ రహీం, ఎమ్ వసంతారావు, దేవ తోటి నాగేశ్వరరావు, ఎల్ జయరాజు, ఊటుకూరి వెంకటేశ్వర్లు, డి నారపరెడ్డి, పాస్టర్ మధుసూదనరావు, మెరక పరమేష్, న్యాయవాదుల సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు బూధరాజు శశికిరణ్, రాజాలు పాల్గొన్నారు.