Home ప్రకాశం ప్రయగాత్మక విద్యతోనే మంచి భవిష్యత్తు

ప్రయగాత్మక విద్యతోనే మంచి భవిష్యత్తు

571
0

చీరాల : విద్యార్థులు ప్రయోగాత్మక చదువులతోనే ఉన్నత భవిష్యత్తు ఉంటుందని యలమంచిలి గ్రూప్ వ్యవస్థాపకులు యలమంచిలి రామకృష్ణ పేర్కొన్నారు. తిరుపతి ఐఐటీలో ఈనెల 28, 29తేదీలలో జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్, యాప్ డవలోప్‌మెంట్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్‌పై జరిగిన వర్క్ షాపులో వీఆర్ఎస్ & వైఆర్ఎన్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈసందర్భంగా విద్యార్థులు సోమవారం కళాశాలలో రామకృష్ణను కలసి వర్క్‌షాపులో ఇచ్చిన శిక్షణ గురించి వివరించారు. ఈసందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రయోగాత్మక విద్యను నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇంజినీరింగ్ విద్యార్థులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరు సొంత ఆలోచనలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. నూతన ఆవిష్కరనలపై దృష్టి పెట్టాలని తెలిపారు. రీసెర్చ్అ నేది నిరంతర ప్రక్రియగా ఉండాలని చెప్పారు. తిరుపతిలో నేర్చుకున్న విషయాలను వదిలేయకుండా ఎప్పటికప్పుడు మననం చేసుకుంటు మరింతగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఇటువంటి వర్క్ షాప్ లల్లో పాల్గొనాలన్నారు. విద్యార్థులు షేక్ మహమద్ జానీ, నెరేళ్ల శసాంక్, రాధాకృష్ణ చౌదరి, గుణశేఖర్‌ను అభినందించారు. కార్యక్రమంలో జీఎం దానయ్య, ఏవో సత్తార్ పాల్గొన్నారు.