Home ప్రకాశం సొంత ఆలోచనాలతోనే ఉన్నత భవిష్యత్తు

సొంత ఆలోచనాలతోనే ఉన్నత భవిష్యత్తు

513
0

* భావవ్యక్తీకరణ చాలా ముఖ్యం
* విద్యార్ధి దశలోనే క్రమశిక్షణ అలవరచుకోవాలి
* విఆర్‌ఎస్‌ అండ్‌ వైఆర్‌ఎన్‌ కళాశాల సెమినార్‌లో డాక్టర్ రత్తయ్య చౌదరి
చీరాల : ప్రతి విద్యార్థి సొంత ఆలోచనలు చేయాలని నూతన అవిష్కరణలకు ప్రయత్నించాలని అపుడే వారికి ఉన్నత భవిష్యత్తు ఉంటుందని నాసా స్పేస్ షటిల్లో పనిచేసిన డాక్టర్ రత్తయ్య చౌదరి పేర్కొన్నారు. నాసా స్పేస్ షటిల్లో అంతరిక్షంలో కి వెల్లే వ్యామోగాముల వ్యక్తి గత అవసరాలకు సంబంధించిన అనేక పరిశోధనల్లో రత్తయ్య చౌదరి పాల్గొన్నారు. చౌ గా గుర్తింపు పొందిన ఈయన చీరాల వచ్చిన సందర్భంగా శనివారం చీరాల వీఆర్ ఎస్ & వై ఆర్ ఎన్ ఇంజినీరింగ్ (యలమంచిలి గ్రూప్ ) కళాశాల విద్యార్థులకు సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్‌తో పాటు అమెరికాలో ప్రాజక్టులు ఏవిధంగా చేస్తారు. మన దేశంలో ప్రాజక్టుల పరిస్థితి. మనం ఏవిధంగా ప్రాజక్టులు చేయాలి అనే అంశాలపై రతయ్య చౌదరి గెస్ట్ లెక్చర్ ఇచ్చారు.

ఈసందర్భంగా సాఫ్ట్వేర్ ఇంజీనీరింగ్ కోర్స్ ఏవిధంగా ఉపయోగపడుతుంది. కోర్సుకు ఏవిదమైన అవకాశాలు ఉన్నాయి. తదితర అంశాలను విద్యార్థులకు వివరించారు. ఇటీవల కాలంలో విద్యార్థులు పుస్తకాలకే ప్రాధాన్యత నిస్టు ప్రయోగాలను నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. థియరీతో పాటు ప్రయోగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రతి విషయాన్ని లాజికల్‌గా ఆలోచించాలని చెప్పారు. రిక్వైర్మెంట్ తెలుసుకొని ఏనాలసిస్ చేయాలన్నారు. సొంతంగా ఆలోచించి నూతన ఆవిష్కరనలు చేయాలన్నారు. ఇటువంటి వారికి సాఫ్ట్ వేర్ పరిశ్రమలో మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువ మంది సొంత ఆలోచనలు కాకుండ ఎవరో చేసిన ప్రయోగాలపై ఆధార పడుతున్నారని అందువలనే వారు రాణించ లేక పోటు న్నారని వివరించారు. మొదట మనము ఒక ప్రాజెక్టును ఎంచుకొని అందులో ఎటువంటి రిస్కులు ఎదురవుతాయో ముందుగా అంచనా వేయాలని చెప్పారు. ప్రతికూల పరిస్థితులను అంచనా వేయగలిగినపుడే విజయం సాధించ గలుగుతామని సమయం ఆదా అవుతుందన్నారు. సాఫ్ట్ వేర్ పరిశ్రమలో సమయం చాలా విలువైనది తెలిపారు. తక్కువ సమయంలో మంచి ఫలితాలు రావాలంటే ప్రణాళిక పక్కాగా ఉండాలని వివరించారు. దీనికి క్రమశిక్షణ చాలా అవసరమన్నారు. విద్యార్థులు ఇప్పటి నుంచి వీటిపై దృష్టి పెట్టి అమలు చేస్తే సాప్ట్ వేర్‌లో మంచి అకాశాలు దక్కించు కుంటారని చెప్పారు.