Home ప్రకాశం ప్రకాశం జిల్లాను ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని వినతి

ప్రకాశం జిల్లాను ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయాలని వినతి

323
0

– ఉప సభాపతికి వినతి పత్రం అందజేసిన తాడివాలస దేవరాజు
– సానుకూలంగా స్పందించిన రఘుపతి
– ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు వరం
– కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే చెందుతుంది.
– ఆధునిక వైద్యం అనేది పేదలకు అందుబాటులో ఉండాలి డాక్టర్ అమృతపాణి
– ఆరోగ్యశ్రీని బలోపేతం చేస్తున్న సీఎం జగన్
– డాక్టర్ అమృతపాణి డెప్యూటీ స్పీకర్ కొన రఘుపతిని వెండి కిరీటంతో ఘన సత్కరం

ప్రకాశం జిల్లాలో పేదలు అధిక సంఖ్యలో ఉన్నారు. వలసలు ఎక్కువగా వుంటాయి . శ్రామిక వర్గం ఎక్కువగా ఉంటుందని… పోలైడ్ సమస్య తీవ్రంగా ఉంది. అటువంటి జిల్లాను ఆరోగ్యశ్రీ పైలైట్ ప్రాజెక్టుకి ఎంపిక చేస్తే పేదలకు మేలుజరుగుతుంది. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని శ్రీ కామాక్షి కేర్ హాస్పటల్ ఎండీ, చీరాల జిల్లా సాధన జాక్ కన్వీనర్ తాడివలస దేవరాజు ఉపసభాపతి కోన రఘుపతికి వివరించారు.

గురువారం ఒక ప్రెవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు చీరాల వచ్చిన రఘుపతిని అమ్మ కంటి హస్పిటల్ వద్ద అమృతపాణి, డిప్యూటీ స్పీకర్ కొన రఘుపతిని వెండి కిరీటంతో ఘనంగా సత్కరించారు. దేవరాజు మర్యాద పూర్వకంగా కలసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా దేవరాజు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ విషయంలో ముక్యమంత్రి నిర్ణయం బాగుందన్నారు. వెయ్యి రూపాయలు దాటిన ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం అందించటం పేదలకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో చేనేతలు, మత్స్యకారులు, కులవృత్తులు, శ్రామిక వర్గం, పేదలు అధిక సంఖ్యలో ఉన్నారని ఉపసభాపతికి వివరించారు. అటువంటి జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తే బాగుంటుందని అందుకు సహకరించాలని కోరారు.

తాడివలస దేవరాజు చెప్పిన విషయాలు సావధానంగా విన్న రఘుపతి ఈవిషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి దీనిని అమలు చేసేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా చీరాల, బాపట్లను జంట నగరాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వి అమృతఫాణి, మల్లిల బుల్లిబాబు, అవ్వరు ముసలయ్య, కర్నేటి రవి, కిషోర్, పెర్లి నాని, యతం క్రాంతి, చిరంజీవి, కాసే విజయ్ పాల్గొన్నారు.