Home ప్రకాశం ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని జనవరి 8న జాతీయ సమ్మె

ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని జనవరి 8న జాతీయ సమ్మె

437
0

వేటపాలెం : ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని కోరుతూ జనవరి 8న జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు టంగుటూరు ప్రభాకరరావు, ఎవి రమణ కోరారు. ఆశా కార్యకర్తల సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. ఆశా కార్యకర్తలకు ఇప్పటి వరకు ఇస్తున్న వేతనం పూర్తిగా చెల్లించాలని, రాజకీయ వేధింపులు నివారించాలని డిమాండు చేశారు. ఈనెల 25న ఒంగోలులో జరిగే ధర్నాకు ఆశా కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. సమావేశంలో ఆశా కార్యకర్తల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె సౌభాగ్యం, కె రాణి పాల్గొన్నారు.