Home ప్రకాశం జర్నలిజం వృత్తికి ఆదర్శం రాఘవాచారి ప్రస్థానం

జర్నలిజం వృత్తికి ఆదర్శం రాఘవాచారి ప్రస్థానం

273
0

టంగుటూరు : జర్నలిజం రంగం గర్వపడేలా రాఘవాచారి జీవన ప్రస్తానం సాగిందని సిపిఐ మండల కార్యదర్శి ఎన్ గురవయ్య అన్నారు. ఆయనది మన సనాతన శ్రీ వైష్ణవ కుటుంబం అన్నారు. ఛాందస భావాలకి ప్రసిద్ధి చెందిన వైష్ణవ శాఖ రామాయణ సిద్ధాంతములోని సామాజిక అసమానతలను ఏ కోశానా దరిచేరకుండా జాగ్రత్త తీసుకున్న ఆదర్శమైన కుటుంబం అన్నారు. తెలంగాణలో పుట్టినప్పటికీ జీవితంలో ఎక్కువ భాగం విజయవాడలోనే గడిపారని చెప్పారు.

గుంటూరు జిల్లా కమ్యూనిస్టు పార్టీ నాయకులు కనపర్తి నాగయ్య కుమార్తె జోష్నాను వివాహం చేసుకున్న రాఘవాచారికి ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె స్కూల్కు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మరణించడం వారికి తీరని వ్యధ కలిగించింది. పెద్ద కుమార్తె డాక్టర్ డాలి(అనుపమ) సీనియర్ జర్నలిస్టు చెన్నమనేని రాజేశ్వరరావు కుమారుడు సంజయ్ ను వివాహం చేసుకున్నారు.

రాఘవాచారి విద్యార్థి దశలో ఏఐఎస్ఎఫ్ బాధ్యత వహించడంద్వారా కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షితులయ్యారు. విశాలాంధ్రలో సుదీర్ఘ కాలం పాటు సంపాదకులుగా పనిచేసి జర్నలిజానికి వన్నె తెచ్చారని సిపిఐ మండల కార్యదర్శి ఎన్ గురవయ్య అన్నారు. ప్రజాస్వామ్యమే పరమావధిగా ఆయన అంకితభావంతో పని చేశారని అన్నారు. ఆయన ఆశయాలు ముందుకు తీసుకపోవాలని సూచించారు. ముందుగా సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. రాఘవాచారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో డిబిఎంఎస్ రాష్ట్ర నాయకులు కొండ్రు కోటయ్య, న్యూ డెమోక్రసీ నాయకులు ఎన్ నాగరాజు, కళ్లగుంట బ్రహ్మయ్య, రోశయ్య, ఏసోబు, చిన్నపేతురు, వన్నూరు, మన్నాది, రమేష్ పాల్గొన్నారు.