డిల్లీ: ఆంద్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ పార్లమెంట్ స్ట్రీట్‌లో సోమవారం వైసిపి ఎంపిలు, ఎంఎల్ఎలు ఆందోళన చేపట్టారు. వైసిపి ఎంపిలు పార్లమెంట్ స్ట్రీట్ నుండి కేంద్ర హోంశాఖ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చేందుకు ర్యాలీగా బయలు దేరారు. ఆందోళన చేస్తున్న ఎంపిలు, ఎంఎల్ఎలను డిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళన చేస్తున్న ఎంపిలు, ఎంఎల్ఎలను వ్యాన్‌లో ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.