కంభం : జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్యపై ప్రకాశం జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సమాచారం శాఖ అధికారి కలిసి ఉత్తర్వులు జారీచేసినప్పటికి బెస్తవారిపేట, కంభం మండలాల్లోని కొన్ని స్కూల్స్ నిరాకరిస్తున్నాయని బెస్తవారపేట జర్నలిస్ట్ మిత్రులు కలెక్టర్ కు పిర్యాదు చేసారు. బెస్తవారిపేటలోని ఓ సమావేశానికి హాజరైన కలెక్టర్ పోలా భాస్కర్ ను జర్నలిస్ట్ మిత్రులు కలిసి ఉచిత విద్య పై కొన్ని స్కూల్స్ యాజమాన్యం ఇబ్బందులు పెడుతున్నారని పిర్యాదు చేసారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ స్కూల్స్ పేర్లు అడిగి తెలుసుకున్నారు. ముందుగా మండల విద్య శాఖ అధికారికి పిర్యాదు చేయండని చెప్పారు. ఆ తర్వాత తగిన చర్యలు తీసుకొందామని తెలియజేసారు..