Home ప్రకాశం ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుని కుటుంబానికి రూ.12వేల ఆర్థిక సహాయం

ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుని కుటుంబానికి రూ.12వేల ఆర్థిక సహాయం

550
0

చీరాల : అసోసియేషన్ సభ్యుల కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని శ్రీకామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు అన్నారు. డొక్కా జయ శేఖర్ చీరాల వైకుంటపురంలో గత 30 సంవత్సరాలుగా ప్రాథమిక చికిత్స వైద్యుడుగా సేవలందిస్తు అనారోగ్యంతో మరనించాడు. తాడివలస దేవరాజు రూ.5వేలు, మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్ రూ.7వేలు కలిపి రూ.12వేలను శేఖర్ కుమారుడు మోహన్ కు అందించారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ సుగుణరావు ,యేసు మాట్లాడుతూ గ్రామీణ వైద్యులలో సభ్యుడు శేఖర్ ను కోల్పోవడం ఎంతో బాధాకరమని అన్నారు. వాళ్ల కుటుంబానికి అసోసియేషన్ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు. తాడివలస దేవరాజు మాట్లాడుతూ శేఖర్ గత 20 సంవత్సరాలుగా తన శ్రేయోభిలాషిని, తన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. వారి కుటుంబానికి వైద్యపరంగా అండగా ఉంటానని తెలియజేశారు. కార్యక్రమంలో డేవిడ్, గోలి శ్రీనివాస్, ప్రవీణ్, శేఖర్, కె వెంకటేశ్వర్లు, సుగుణరావు పాల్గొన్నారు.