Home ప్రకాశం చీరాల జిల్లా సాధన జేసికి చీరాల-పేరాల నాయి బ్రాహ్మణ సేవా సంఘం సంఘీభావం

చీరాల జిల్లా సాధన జేసికి చీరాల-పేరాల నాయి బ్రాహ్మణ సేవా సంఘం సంఘీభావం

326
0

చీరాల : నాయీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు మాచవరపు వెంకటేశ్వర్లు, బోసుబాబు, కోరువడా సత్యనారాయణ మాట్లాడుతూ చీరాల జిల్లా కేంద్రం అయితే అనేక ప్రయోజనాలతో పాటు నాయి బ్రాహ్మణులకు వృత్తి అవకాశాలు కూడా పెరుగుతాయని అన్నారు. ఈరోజు నుండి షాపులకు వచ్చే ప్రతి ఒక్క కస్టమర్ చేత సంతకాల సేకరణ చేపడతామని తెలిపారు. చీరాల జిల్లా సాధన జెఎసి కన్వీనర్ తడివలస దేవరాజు చేపట్టే ప్రతి ఒక్క కార్యక్రమానికి తాము తోడుగా ఉంటామని ఉద్యమానికి మద్దతు ప్రకటించారు.

కార్యక్రమంలో సుబ్బారావు, అతవ బోసుబాబు, ఎం వెంకటేశ్వర్లు, కోరువాడు సత్యనారాయణ, ఎం సత్యనారాయణ, వల్లూరి వెంకట సుబ్బారావు, కార్యదర్శి వల్లూరి శ్రీనివాసరావు, సభ్యులు నూకరాజు, బాల పున్నయ్య, బి శ్రీనివాసరావు, పి శివ కుమార్, కే శివ, వల్లూరి వెంకట స్వామి పాల్గొన్నారు.