Home ప్రకాశం చీరాల జిల్లా జేఏసీకి ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు

చీరాల జిల్లా జేఏసీకి ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు

323
0

చీరాల : చీరాల-పేరాల ఉద్యమాన్ని చేపట్టిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరుతో చీరాల కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలని చేపట్టిన ఉద్యమానికి, జేఏసీ కన్వీనర్ తాడివలస దేవరాజుకు తమ సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నట్లు ప్రైమరీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కామాక్షి కేర్ హాస్పిటల్ ఆవరణలో అసోసియేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.

సమావేశంలో జేఏసీ కన్వీనర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ చీరాల జిల్లా సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని కోరారు. అసోసియేషన్ వ్యవస్థాపకులు సాంబశివరావు, అధ్యక్షులు సుగుణ రావు, సెక్రటరీ శేఖర్ మాట్లాడుతూ గ్రామీణ వైద్యులుగా చీరాల, పర్చూరు నియోజకవర్గాలలో తమ దగ్గరికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరి చేత సంతకాల సేకరణ చూపిస్తామని తెలిపారు. జిల్లా సాధన కోసం తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు గోలి శ్రీనివాస్, కుంకలమర్రు వెంకటేశ్వర్లు, ప్రవీణ్, డేవిడ్, శేఖర్ ,సాంబశివరావు, చీరాల వెంకటేశ్వర్లు, సుగుణ రావు, కె సుబ్బారావు పాల్గొన్నారు