చీరాల : కొణిజేటి చేనేత పురికాలనీలో లబ్దిదారుల పేరుతో బ్యాంకులో తీసుకున్న రుణాల విషయంపై కొణిజేటి చేనేతపురిలో చేనేత అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు మాట్లాడుతూ బ్యాంకు రుణాల బకాయిలున్న చేనేతలకు న్యాయం చేస్తామన్నారు. కొత్తపేట ఎస్బిఐలో తమపేర్లతో మంజూరైన రుణాలు ఎంఎల్ఎ అనుచరులు తీసుకున్నట్లు లబద్దిదారులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. చేనేతల సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి తీసుకెళ్లి అందరికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో చేనేత చేనేత ఎడిఇ శివన్నారాయణ, డవలప్మెంట్ ఆఫీసర్ ఆఫీస్ హరిహరశర్మ, జి రవిబాబు, వెంకటేశ్వర్లు, టిడిపి నియోజకవర్గ నాయకులు సజ్జా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.