కందుకూరు : జన్మభూమి, నీరు-మీరు, దీపం, శ్రమదానం, పచ్చదనం-పరిశుభ్రత, ఆదరణ వంటి పలు విభిన్నమైన కార్యక్రమాలతో పరిపాలనా విధానాలలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడని,రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ప్రవేశంతోనే పరిపాలనా విధానంలో వేగం పెరిగిందని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చంద్రబాబు నాయుడు కృషిని బిల్‍క్లింటన్, బిల్‍గేట్స్ వంటి దిగ్గజాలు ప్రశంసించారని టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి, టిడిపి శిక్షణా కేంద్రం డైరెక్టర్ దాసరి రాజా మాస్టారు పేర్కొన్నారు.
తెలుగు విజయం శిక్షణా కేంద్రంలో 154వ బ్యాచ్ టిడిపి శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో అపర చాణుక్యునిగా మంచి పేరు సంపాదించైన వ్యక్తి చంద్రబాబేనని పేర్కొన్నారు. రాబోయే తరాల భవిష్యత్తు కోసం నిరంతరం తపన పడే నాయకుడు చంద్రబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు సమర్థత, నిజాయితీని నమ్మి 2019 సాధారణ ఎన్నికలలో మళ్ళీ పట్టం కట్టడానికి తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తొలుత పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. చంద్రబాబు రాజకీయాల్లో 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శిక్షణా శిబిరంలో కేకు కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.
శిక్షణాకార్యక్రమములో గుంటూరు జిల్లా నుండి తెనాలి, వేమూరు, వినుకొండ, సత్తెనపల్లి, ప్రకాశం జిల్లా నుండి కందుకూరు,మార్కాపురం, దర్శి, నెల్లూరు జిల్లా నుండి సూళ్లూరుపేట, వెంకటగిరి, ఉదయగిరి నియోజకవర్గాలకు చెందిన మండల, గ్రామ అధ్యక్ష, కార్యదర్సులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు హాజరైనారు. కార్యక్రమంలో శిబిరం కో ఆర్డినెటర్ మల్లికార్జున, శిక్షలు చైతన్య, పరమేశ్వర రెడ్డి పాల్గొన్నారు.