చీరాల : అత్యధిక బిసి ఓటర్లు ఉన్న చీరాలలో రానున్న ఎన్నికల్లో బిసిలకు ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు బిసి నాయకులు కోరారు. ప్రగడ కోటయ్య విగ్రహం వద్ద సోమవారం బిసి గర్జన సభ నిర్వహించారు. తొలుత పందిళ్ళపల్లి నుండి చీరాల గడియారం స్తంభం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముందుగా జ్యోతిరావు పూలే, ప్రగాఢ కోటయ్య విగ్రహలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభకు టీడీపీ నాయకులు సజ్జ వెంకటేశ్వరరావు, గవిని శ్రీనివాసరావు పాల్గొన్నారు. పొన్నూరు మున్సిపల్ ఛైర్పెర్సన్ సజ్జ హేమాలత మాట్లాడుతూ బీసీలను మొదటగా గుర్తించిన జ్యోతిరావుపూలే, అంబేద్కర్ తర్వాత ఎన్టి రామారావు పలు శాఖలలో అధిక ప్రాధాన్యత కల్పించారని చెప్పారు. రాబోయే2019 ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు బీసీలను గుర్తించి చీరాల ప్రాంతంలో టీడీపీ ఎమ్మెల్యే సీటును బీసీలకు కేటాయించాలని కోరారు.
టిడిపి నాయకులు సజ్జ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీ అధిష్టానం అయిన మొదటి స్థానం బీసీలకు కేటాయిచాలని కోరారు. సీటు ఎవరికి ఇచ్చిన బీసీలందరు సమిష్ట కృషితో అహర్నిశలు కృషి చేసి గెలుపించుకుంటామన్నారు. కార్యక్రమంలో చీరాల ఎంపిపి గవిని శ్రీనివాసరావు, జెడ్పిటిసి పృద్వి అరుణ, దేవాంగపురి సర్పంచ్ పృద్వి చాందిని, రామన్నపేట సర్పంచ్ బట్ట ఆనంతలక్ష్మి, టిడిపి జిల్లా కార్యదర్శి బట్ట లీలానందప్రసాద్, సాల్మన్సెంటర్ మాజీ సర్పంచ్ అడపా వెంకటేశ్వర్లు, బుర్లవారిపాలెం మాజీ ఉపసర్పంచ్ గవిని నారాయణ, బోయినవారిపాలెం మాజీ ఎంపిటిసి బోయిన కేశవులు, మాజీ ఎంపిపి దామర్ల శ్రీకృష్ణ పాల్గొన్నారు.