గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్శిటి పరిధిలోని అంతర్ కళాశాలల తైక్యోన్దో పోటీలు చిలకలూరిపేట చుండి రంగనాయకులు డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. పోటీలలో చీరాల చైతన్య భారతి డిగ్రీ కళాశాల విద్యార్థులు రెండు బంగారు పతకాలు సాధించారు. డిగ్రీ ద్వితీయ సంవత్సరం బిఎస్సీ చదువుతున్న విద్యార్ధి సాయితేజకు పురుషుల విభాగంలో బంగారు పతకం, డిగ్రీ ద్వితీయ సంవత్సరం బికాం చదువుతున్న విద్యార్ధిని వినీతకు మహిళల విభాగంలో బంగారు పతకం సాధించారు. సాయితేజ మార్చిలో జరగబోవు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల యాజమాన్యం విద్యార్థులను సత్కరించింది. తైక్వాండో కోచ్లు నయ్యద్ సలావుద్దీన్, ఏ శివను అభినందించారు. ఈ విద్యా సంవత్సరంలో యూనివర్శిటీ స్ధాయిలో మొదటి బహుమతి రావడం ఇది నాల్గవదని ప్రిన్సిపాల్ ఎన్ సోమేశ్వరరావు పేర్కొన్నారు. కేవలం చదువే కాకుండా అన్నిరంగాలలో విద్యార్థులను తమ కాలేజి ప్రోత్సహిస్తోందన్నారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం ముంగర రాంబాబు, ఉమ్రాన్, సురేష్, వెంకటేశ్వరరావు, కోచ్లీలు సలావుద్దీన్, ఏ శివ పాల్గొన్నారు.