Home ప్రకాశం జన్మభూమి గ్రామసభలో సంక్రాంతి కానుకల పంపిణీ

జన్మభూమి గ్రామసభలో సంక్రాంతి కానుకల పంపిణీ

438
0

టంగుటూరు : టంగుటూరులో జరిగిన జన్మభూమి గ్రామ సభలో ఎంపీపీ చదలవాడ చంద్రశేఖర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు సంక్రాంతి కానుకలు, పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయాక లోటు బడ్జెట్ ఉన్నా, బీజేపీ సహకారం లేకపోయినా, ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. అలాగే రైతులు 33 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇచ్చారని చెప్పారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించిందని అన్నారు. రైతులకు రుణమాఫీ, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లును ఇస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ పక్కా గృహాలు పార్టీలకతీతంగా అర్హులైన లబ్ధిదారులందరికీ అందేలా చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే గృహాలు, పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో హనుమంతరావు, తహశీల్దార్ రాజ్ కుమార్, జెడ్పిటిసి పటాపంజుల కోటేశ్వరమ్మ, టిడిపి మండల అధ్యక్షులు కామని విజయ్ కుమార్, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.