చీరాల : జిల్లాలో విద్యార్ధులకు అవసరమైన విశ్వవిద్యాలయం నిర్మించకుండా జ్ఞాన భేరిపేరుతో నిర్వహించే సభలు ఎవరిని మోసం చేయడానికని ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి సిహెచ్ సుధాకర్, బి రఘురామ్ ప్రశ్నించారు. చీరాల కెకెసి కాంప్లెక్స్‌లో శనివారం జరిగిన ఎస్ఎఫ్ఐ ప్రాంతీయ కమిటి మహాసభలో మాట్లాడారు. ఎన్నికల్లో విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజ్ రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రకటనల్లో ఉన్న సంక్షేమం ఆచరణలో లేదని ఆరోపించారు. అనంతరం నూతన కమిటి ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా చరిత, పూర్ణలను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు గవిని నాగేశ్వరరావు, లింగం జయరాజ్, జేవీవి నాయకులు డి నారపరెడ్డి, ఎస్ఎఫ్ఐ మాజీ డివిజన్ కార్యదర్సులు బాబురావు, మనిబాబు, ఏసురత్నం, ఏసుబాబు, ఆదిత్య పాల్గొన్నారు.