Home ప్రకాశం పెదకల్లగుంటలో కేంద్ర కరువు బృందం పర్యటన

పెదకల్లగుంటలో కేంద్ర కరువు బృందం పర్యటన

354
0

కొండపి : పెద్దకళ్లకుంటలో కేంద్ర కరువు బృందం బుధవారం పర్యతించింది. గ్రామంలో పలు వ్యవసాయ పంటలను పరిశీలించారు. కంది ఆరడుగులు పెరిగి ఎకరాకు 5క్వింటాలు రావాల్సి ఉందగా కరువు కారణంగా మూడు అడుగులు పెరిగి 50కేజీలు కూడా రావట్లేదని రైతులు వాపోయారు. నేలలో తేమ శాతం లేనందున పొగాకు బ్రతుకడం లేదని, ఎదుగుదల లేక మొక్కలు చనిపోతున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేశారూ.

రైతులు చెప్పిన వివరాలు, పంటలను పరిశీలించిన కేంద్ర బృందం రైతు సమస్యలను ప్రభుత్వానికి వివారిస్తామని చెప్పారు. జాయింట్ సెక్రటరీ నీరజ, సెక్రటరీ శ్రీవాత్సవ, జిల్లా జెసి నాగలక్ష్మి, జేడీ జే శ్రీరామ్ మూర్తి, ఆర్డిఏ కెఎస్ రామారావు, డుమా పిడి వెంకటేశ్వర్లు, బాలానాయక్, సింగరాయకొండ ఏవో శేషారెడ్డి, కొండపి తాసిల్దార్ చిరంజీవి, కొండపి వ్యవసాయ శాఖ అధికారి రాము పాల్గొన్నారు.