Home ఉపాధి ఐఫాసిస్ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపికైన చైతన్య భారతి డిగ్రీ విద్యార్థులు

ఐఫాసిస్ కంపెనీలో ఉద్యోగాలకు ఎంపికైన చైతన్య భారతి డిగ్రీ విద్యార్థులు

416
0

చీరాల : తెనాలి ఎఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ఆవరణలో ఇన్ఫోసిస్ కంపిని ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఎంపికలకు హాజరైన విద్యార్థుల్లో చీరాల చైతన్య భారతి డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సరం బికాం చదువుతున్న ఆరుగురు విద్యార్థులు ఇన్ఫోసిస్ సాప్ట్-వేర్ కంపెని ఉద్యోగాలకు ఎంపికయ్యారు. చీరాల నుండి 20మంది హాజరైనప్పటికి ఎంపికైన ఆరుగురు విద్యార్థులు ఉద్యోగ నియామక పత్రాలు పొందారు.

ఈ సందర్భంగా కళాశాలలో గురువారం అభినందన సభ నిర్వహించారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను కళాశాల యాజమాన్య ప్రతినిధులు అభినందించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మొదటిసారిగా వచ్చిన అవకాశంలోనే ఇంతమంది విద్యార్థులు ఎంపిక కావడం సంతోషంగా ఉందని ప్రిన్సిపాల్ నార్నె సోమేశ్వరరావు అన్నారు. రాబోయే రోజులలో మరిన్ని అవకాశాలు ఉంటాయని చెప్పారు. దానికి తగ్గట్లుగా తర్ఫీదు ఇస్తున్నామన్నారు.

గత ఐదు సంవత్సరాల నుండి డిగ్రీ విద్యార్థుల క్యాంపస్ ఎంపికలో చైతన్య భారతి విద్యార్థులు ముందంజలో ఉన్నారని చెప్పారు. ఎంపికలకు కారణమైన అధ్యాపక బృందానికి, ప్రోత్సహిస్తున్న తల్లితండ్రులకు కృతజ్ఞతలు తెలియచేసారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుండి తరగతులలో డిగ్రీ విద్యతో పాటు విద్యార్థులకు ఉపయోగ పడేవిధంగా వివిధ పోటీ, వృత్తి విద్యా, సాప్ట్-వేర్ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అందువలన విద్యార్థులు సులభంగా ఇంటర్వ్యూలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అందుకు ఈ విజయాలే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం ముంగర రాంబాబు, సురేష్, ఉమ్రాన్, అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది, తల్లితండ్రులు పాల్గొన్నారు.