చీరాల : సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి వాటిని పరిష్కరించడం గ్రీవెన్సు ఉద్దేశ్యమని తహశీల్దార్ ఎం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం తన కార్యాలయంలో అర్జీలు స్వీకరించారు. ఎక్కువ భాగం రేషన్ కార్డ్ కొరకు అర్జీలు వచ్చాయన్నారు. అర్జీలు పరిశీలించి అర్హులైన వారికి కార్డులు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.