Home ప్రకాశం రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా కొత్తపేట జెడ్పి ఉన్నత పాఠశాలలో అంబేద్కర్ నివాళి

రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా కొత్తపేట జెడ్పి ఉన్నత పాఠశాలలో అంబేద్కర్ నివాళి

327
0

చీరాల : భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవంను కొత్తపేట హైస్కూల్ లో ఘనంగా నిర్వహించారు. అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గవిని నాగేశ్వరరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత జాతికి అందించిన గ్రంధం రాజ్యాంగమని అన్నారు.

నేడు భారత రాజ్యాంగ దినోత్సవమని అన్నారు. యుగపురుషుడు అంబేద్కర్ అని అన్నారు. రాజ్యాంగ రచన కాలం 2 సంవత్సరాల 11నెలల 18రోజులని చెబుతారు కానీ ముసాయిదా తయారు చేయడానికి అంబేద్కర్ తీసుకున్నది 141 పనిదినాలు మాత్రమేనని అన్నారు. రాజ్యాంగ పరిషత్ మొత్తం 11సార్లు సమావేశం కాగా7635 సవరణలు సభ్యులు ప్రతిపాదించగా 2473 సవరణలు చేశారని అన్నారు. ప్రాధమిక హక్కుల గురించి రాజ్యాంగ పరిషత్ 38 రోజులపాటు చర్చించారని అన్నారు. ప్రపంచం గర్వించదగ్గ మహామనిషి, యుగపురుషుడు అంబెడ్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యారాలు ఇందిరా ఇజ్రాయెల్, బాలకృష్ణ, రవి, శ్రీనివాసరావు, బిక్షాలు బాబూ, పవని భానుచంద్రమూర్తి పాల్గొన్నారు.