పెద్దారవీడు : తోకపల్లి పంచాయతీల్లోని హనుమాన్ జంక్షన్ కుంట వద్ద బస్టాండు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వివరాల్లోకెళ్తే సుమారు నలభై గ్రామాలకు ప్రధాన కూడలి కుంట. హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, తిరుపతి, గుంటూరు వంటి నగరాలకు నిత్యం ప్రయాణికులు ఎక్కువగా ఇక్కడి నుండి వెళ్తారు. ఇంతమంది ప్రయాణికుల రద్దీ ఉన్నప్పటికీ కుంటలో కనీస సదుపాయాలు కూడా లేకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. బస్టాండ్, వాటర్ సదుపాయం ,బాత్రూమ్స్ వంటివి లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి నూతన బస్టాండ్, వాటర్ సదుపాయం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.