రాచర్ల : గిద్దలూరు నియోజకవర్గ వైస్సార్ కాంగ్రెస్ బూత్ కమిటి సమావేశం బుధవారం నిర్వహించారు. సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జి ఇల్లూరి వెంకటేశ్వర రెడ్డి (ఐవి రెడ్డి) మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పార్టీని విజయపధాన నదిపేందుకు, జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు, రాజన్న కలలుగన్న పేదల సంక్షేమ రాజ్యం తెచ్చేందుకు ప్రతి ఒక్క వైసిపి కార్యకర్త సైనికునిలా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాచర్ల మండల కన్వీనర్ పి జఫ్రూళ్ల ఖాన్, యూత్ నాయకులు దప్పిలి కాశి రెడ్డి, కడితం హుస్సేనయ్య, జక్కం ఎలిశమ్మ, బీసీ సంఘం నాయకులు గడ్డం గోపాల్, పందిళ్ళపల్లి కార్తీక్ పాల్గొన్నారు.