బాపట్ల : సూర్యలంక సముద్ర తీరానికి కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని ఎంఎల్సి అన్నం సతీష్ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. తీరంలో సౌకర్యాల కల్పన ఏర్పాట్లను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈనెల 23న కార్తీక పౌర్ణమి సందర్భంగా తీసుకోవలసిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు ఇచ్చారు. పెద్ద సంఖ్యలో హాజరయ్యే భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. మహిళలు బట్టలు మార్చుకునేందుకు వీలైన ఏర్పాట్లు చేయాలన్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బద్రత ఏర్పాటు చేయాలన్నారు. ఈతకు వెళ్లిన వారికి రక్షణగా గజ ఈతగాళ్లను సిద్దంగా ఉంచాలని సూచించారు. లోతైన ప్రదేశాలకు వెళ్లకుండా నియంత్రించాలని సూచించారు.