వేటపాలెం : మారథాన్ జాతీయ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వేటపాలెం మండలం పండిళ్లపల్లి వాస్తవ్యులు రాయడి ప్రదీప్ నాయుడు పోటీల్లో పాల్గొనేందుకు పట్టబద్రుల సంఘం ఆధ్వర్యంలో రూ.4వేల విలువైన చెక్కును అందజేశారు. జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని అభినందించారు. వేటపాలెం జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ బాల సుబ్రహ్మణ్యం చేతులు మీదగా పట్టభద్రుల సంఘం ప్రతినిధులు ఇచ్చారు. కాలేజీ ఎన్సిసి కన్వీనర్ ప్రసాదరావు సత్కరించారు. కార్యక్రమంలో పట్టబద్రుల సంఘం అధ్యక్షుడు ప్రత్తి వెంకట సుబ్బారావు, సెక్రెటరీ గోలి బాలప్రసాద్ మూర్తి, జి శేఖర్ బాబు, కరణం మురళి, నూకల బసవయ్య, మస్తాన్ రెడ్డి, పి నాగేశ్వర రావు, భద్రయ్య పాల్గొన్నారు.