చీరాల : మహిళ మండలి సమక్షంలో రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో ఈపురుపాలెం బ్రహ్మనాయుడు ఐటిఐ కళాశాల విద్యార్థులకు హెచ్ఐవి, ఎయిడ్స్పై అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. సదస్సులో సంస్థ డైరెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యాధి లక్షణాలు చెప్పారు. దాని నుండి ఎలా బయట పడాలి అని సూక్తులు చెప్పారు.
కళాశాల ప్రిన్సిపాల్ సత్తర్ మాట్లాడుతూ విద్యార్థులు వ్యాధి గురించి తెలుసుకొని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శంకర్, ప్రేమ్ పాల్గొన్నారు.