Home జాతీయం మోడీ మాటల్లోనే ఐక్యత – చేతల్లో దక్షిణాదిపై వివక్ష

మోడీ మాటల్లోనే ఐక్యత – చేతల్లో దక్షిణాదిపై వివక్ష

404
0

అమరావతి : మోడీ మాటల్లో, వేదికలపై చేస్తున్న ఉపన్యాసాల్లో ఉన్న ఐఖ్యత ఆచరణలో కనిపించడంలేదు. ఏంటి పొంతనలేని మాటలు చెబుతున్నామ నుకుంటున్నారా? ఇది వాస్తవం. ఉత్తరాది ప్రజలపై ఉన్న ప్రేమ, శ్రద్ధ దక్షిణాదిపై మోడీకి, బిజెపికి ఏమాత్రం లేదు. అందుకు నిదర్శనం నిన్న మోడీ దేశ సమైక్యతకు చిహ్నంగా ఆవిష్కరించిన ఉక్కు మనిషి, సమైక్యవాది సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ తీరే…

దేశ ప్రజలందరి సొత్తు వేల కోట్లు ఖర్చుపెట్టి సర్దార్ పటేల్ విగ్రహం నిర్మించ్చారు. ఐఖ్యతకు చిహ్నంగా ప్రపంచంలో అత్యంత ఎత్తుగా సర్దార్ పటేల్ విగ్రహం నిర్మాణం చేశారు. ఆవిగ్రహాన్ని ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. విగ్రహ ఆవిష్కరణ శిలాఫలకంపై10భాషల్లో ప్రచురించారు. దేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో ముడొస్తానంలో ఉన్న తెలుగుకు శిలాఫలకంపై చోటులేదు. దక్షిణాది భాషల్లో రెండోది తమిళం. తమిళంలో రాసినవాటిలో తప్పులున్నాయన్న కారణంతో రాసిన వాటినీ చేరిపేశారు.

‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఐక్యతకు చిహ్నం అయితే అందులో తెలుగుకు స్థానం ఎందుకు లేదదని భాషా కోవిదులు ప్రశ్నిస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే తెలుగు భాషను బీజేపీ పట్టించుకోలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ ఐక్యతకు చిహ్నంగా చెబతున్న విగ్రహం శిలా ఫలకంపై దక్షిణాది భాషలకు స్థానం ఎందుకు కల్పించలేదని ప్రశ్నిస్తున్నారు.