Home విద్య సెయింట్ ఆన్స్ సివిల్ విద్యార్ధులకు బ‌హుమ‌తులు

సెయింట్ ఆన్స్ సివిల్ విద్యార్ధులకు బ‌హుమ‌తులు

383
0

చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల సివిల్ విద్యార్ధులు పేప‌ర్ ప్ర‌జెంటేష‌న్‌, పోస్ట‌ర్ ప్ర‌జెంటేష‌న్‌, డిబేట్ పోటీల్లో ప్ర‌ధ‌మ‌, ద్వితీయ బ‌హుమ‌తులు సాధించిన‌ట్లు క‌ళాశాల సెక్ర‌ట‌రీ వ‌న‌మా రామ‌కృష్ణారావు, క‌ర‌స్పాండెంట్ ఎస్ ల‌క్ష్మ‌ణ‌రావు తెలిపారు. గుంటూరు ఆర్‌విఆర్ అండ్ జెసి ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో నిర్వ‌హించిన జాతీయ స్థాయి టెక్నిక‌ల్, క‌ల్చ‌ర‌ల్‌, స్పోర్ట్స్ ఫెస్ట్‌లో సివిల్ కార్నివాల్ – 2కె18 పోటీల్లో పి గౌత‌మ్ రూపొందించిన కాంక్రీట్ క్లాత్‌కు మొద‌టి బ‌హుమ‌తి, చ‌ల‌ప‌తి ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో నిర్వ‌హించిన జాతీయ స్థాయి టెక్నిక‌ల్‌, ఆర్ట్స్‌, క‌ల్చ‌ర‌ల్ సింపోజియం ఉద్గోష్లో కాంక్రీట్ క్లాత్‌ పోస్ట‌ర్ ప్ర‌జెంటేష‌న్‌లో పి గౌత‌మ్‌కు మొద‌టి బ‌హుమ‌తి, చీమ‌కుర్తి బూబేప‌ల్లి వెంకాయ‌మ్మ‌, సుబ్బారెడ్డి ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో నిర్వ‌హించిన టెక్నో క‌ల్చ‌ర‌ల్ ఫెస్ట్ టెక్ ధ‌రానా2కె18 పోటీల్లో పి గౌత‌మ్ రూపొందించిన ఆర్గోస్ యాజ్ ఎ స్మార్ట్ క‌న్‌స్ర్ట‌క్ష‌న్ మెటీరియ‌ల్‌కు పోస్ట‌ర్ ప్ర‌జెంటేష‌న్ విభాగాల్లో మొద‌టి బ‌హుమ‌తి సాధించిన‌ట్లు తెలిపారు.

విజ‌య‌వాడ ప్ర‌సాద్ వి పొట్లూరి సిద్దార్ధ ఇంజ‌నీరింగ్ కాలేజిలో నిర్వ‌హించిన టెక్నిక‌ల్ సిపోజియం సితార్‌2కె18లో డిబేట్ పోటీల్లో కె హేమ‌ల‌త‌, ఎం సాయిఅచ్చుత్ ఇంట‌ర్ లింకింగ్ ఆఫ్ రివ‌ర్స్‌పై రూపొందించిన పోస్ట‌ర్ ప్ర‌జెంటేష‌న్‌లో ద్వితీయ బ‌హుమ‌తి సాధించిన‌ట్లు ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ పి ర‌వికుమార్, హెచ్ఒడి సిహెచ్ ప‌వ‌న్‌కుమార్ తెలిపారు. బ‌హుమ‌తులు సాధించిన విద్యార్ధుల‌ను అధ్యాప‌క‌, అధ్యాప‌కేత‌ర సిబ్బంది అభినందించారు.