చీరాల : ఐటిసి, ఎంఎస్‌కె సహకారంతో రక్షణ సంస్థ ఆధ్వర్యంలో వాడరేవు జెడ్‌పి ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం స్వచ్ఛత ఈసేవ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాల ఆవరణలో జరిగిన సభకు ప్రధానోపాధ్యాయులు బాలకృష్ణ అధ్యక్షత వహించారు. చేతుల పరిశుబ్రతపై ఐటిసి ఫాక్టరీ పర్సనల్ మేనేజర్ టిఎ పవన్ కుమార్ విద్యార్ధులకు వివరించారు. విద్యార్ధులకు సవలిన్ లిక్విడ్ అందజేశారు. కార్యక్రమంలో సేప్టీ మేనేజర్ ఎం నరేంద్రరెడ్డి, వెల్ఫేర్ ఆఫీసర్స్ వహీద్, సంపత్, డాక్టర్ పున్నారావు, మాధవి, యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు చిప్పలపల్లి శివరాజు, గోసాల సుధాకర్, పి అనిల్, పి రాజా, పి రాహుల్, రక్షణ సంస్థ డైరెక్టర్ వజ్జా శ్రీదేవి పాల్గొన్నారు.