చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో ఓటరు నమోదుపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో వేటపాలెం తహశీల్దారు కెఎల్ మహేశ్వరరావు, ఎఎస్ఒ ఎస్ అయూబ్ విద్యార్ధులతో మాట్లాడారు. ఓటు హక్కు ప్రాధాన్యత, ఓటు హక్కు పొందే విధానం వివరించారు. రానున్న ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని విద్యార్ధులతో ప్రమాణం చేయించారు.
2019జనవరి 1నాటికి 18సంవత్సరాలు నిండిన వాళ్లందరూ ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా ఓటు హక్కకోసం ధరకాస్తు చేసుకోవాలని చెప్పారు. తల్లిదండ్రుల ఓట్ల వివరాలు సరిచూసుకోవాలని చెప్పారు. ceoandhra.nic.in పోర్టల్‌లో సరైన నివాస దృవీకరణ, ఫోటో, ఆధార్ నెంబర్‌తో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎం పవన్ పాల్గొన్నారు.