ఒంగోలు : ఎల్‌బిజి భవన్ మీటింగ్ హాల్లో హెల్ప్ సంస్ధ ఆధ్వర్యంలో బాలల హక్కులు, చైల్డ్‌లైన్ సంస్థ కృషి అంశంపై శుక్రవారం మీడియా వర్కషాప్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా చైల్డ్‌లైన్ ప్రతినిధి సాగార్ మాట్లాడుతూ బాలల హక్కుల కొరకు తమ సంస్ధ నిర్వహిస్తున్న కార్యాచరణను వివరించారు. బాల్య వివాహలు అరికట్టేందుకు తాము చేస్తున్న కృషికి మీడియాతోపాటు ప్రతిఒక్కరు సహకరించాలని కోరారు. దీనివల్ల ఆరోగ్యవంతమైన సమాజం అభివృద్ది చెందుతుందన్నారు. చిన్న పిల్లలను వ్యభిచార గృహాల తరలించే దుష్టసంస్కృతిపై ప్రతిఒక్కరు స్పందించాలన్నారు. వ్యభిచార గృహాల చెరలో ఉన్నవారిని విడిపించిన అనుభవాలు తమ సంస్థకు ఉన్నాయని చెప్పారు. సమావేశంలో సిడబ్ల్యుసి అధికారిణి భారతి పాల్గొన్నారు.