కందుకూరు : టిడిపి సేవామిత్ర శిక్షణ శిబిరం 34వ బ్యాచ్ ముగింపు సభ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణాశిభిరం డైరెక్టర్, కందుకూరు జెడ్‌పిటిసి కంచర్ల శ్రీకాంత్ చౌదరి మాట్లాడారు. గతంలో యూపీఏ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలలో పోర్టు నిర్మాణానికి అనువైన పరిస్థతి ఉందని నివేదిక ఇచ్చినప్పటికీ ఆతర్వాత తప్పుడు నివేదికలు పంపించి పోర్ట్ రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
విభజన చట్టంలో దుగ్గరాజపట్నం పోర్ట్ ఏర్పాటు చేయాలని పొందుపర్చిన కేంద్రం షార్‌ను సాకుగా చూపుతూ ఎపి పట్ల వివక్ష చూపిస్తుందన్నారు. పోర్టుకు అనుకూల ప్రాంతమైన రామాయపట్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం సూచించనప్పటికీ కేంద్రంలోని బిజెపి పోర్ట్ ఏర్పాటు చేయకుండా రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుంది. ఇటువంటి పరిస్తితులలో అన్ని అనుకూలతలు ఉన్న రామయపట్నంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పోర్ట్ ఏర్పాటు దిశగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం జిల్లాకు మేలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో శిక్షకులు కాకర్ల మల్లిఖార్జున్, యర్రా సాంబశివరావు, ఉరుకుంద కో-ఆర్డినేటర్ పోకూరి రాంబాబు, కొల్లి అవినాష్ పాల్గొన్నారు.