చీరాల : ఆచార్య నాగార్జున విశ్విద్యాలయ పోస్టు గ్యాడ్యుయేషన్ దూర విద్య ఫలితాలు విడుదల చేశారు. 2017-18విద్యాసంవత్సరంలో ఎంఎ తెలుగు, ఎంఎస్‌సి మాథ్స్ విభాగాల్లో ఫలితాలు విడుదల చేశారు. జిల్లాలోని ఏడు దూరవిద్య కేంద్రాల్లో చీరాల ఎన్ఎన్ఎస్ డిగ్రీ కాలేజి స్టడీ సెంటర్ విద్యార్ధులు జిల్లా ప్రధమ, ద్వితీయ సా్థనాలు సాధించినట్లు కోఆర్డినేటర్ కె రమేష్ తెలిపారు. నూరుశాతం ఫలితాలు సాధించినట్లు కళాశాల ఛైర్మన్ ఎన్ ప్రకాశరావు, సమన్వయకర్త కె రమేష్‌బాబు, ప్రిన్సిపాల్ పి తులసీకృష్ణ, ఇన్‌ఛార్జి డి బెన్హర్ తెలిపారు. ఎంఎ తెలుగులో వి అనురాధాదేవి, కె వెంకట శివకుమార్ ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించారని తెలిపారు. ఎంఎ మాథ్సలో ఎ వెంకటేష్‌బాబు జిల్లా ప్రధమ స్థానంలో, ఎ ఈశ్వరఫణిశ్రీనివాస్ ద్వితీయ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులను అభినందించారు.