Home విద్య సెయింట్ ఆన్స్‌లో రెడ్‌హ్యాట్ డే వేడుక‌లు

సెయింట్ ఆన్స్‌లో రెడ్‌హ్యాట్ డే వేడుక‌లు

375
0

చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో కంప్యూట‌ర్ సైన్స్ విభాగం, రెడ్‌హ్యాట్ అకాడ‌మి సంయుక్తంగా రెడ్‌హ్యాట్ వేడుక‌లు నిర్వ‌హించిన‌ట్లు క‌ళాశాల సెక్ర‌ట‌రీ వ‌న‌మా రామ‌కృష్ణారావు, క‌ర‌స్పాండెంట్ ఎస్ ల‌క్ష్మ‌ణ‌రావు, ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ పి ర‌వికుమార్ తెలిపారు. రెడ్‌హ్యాట్ అకాడ‌మి దేశంలో గుర్తింపు ఇచ్చిన 8క‌ళాశాల‌ల్లో త‌మ క‌ళాశాల ఒక‌ట‌ని తెలిపారు. రెడ్‌హ్యాట్ గుర్తింపు వ‌ల్ల విద్యార్ధులు నైపుణ్యం పెంచుకునేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. రెడ్‌హ్యాట్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రై దృవీక‌ర‌ణ ప‌త్రాలు పొంద‌వ‌చ్చ‌న్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఆధునిక అంశాల అధ్య‌య‌నానికి రెడ్‌హ్యాట్ అకాడ‌మి తోడ్ప‌డుతుంద‌న్నారు.

సిఎస్ఇ హెచ్ఒడి డాక్ట‌ర్ పి హ‌రిణి మాట్లాడుతూ వివిధ కంపెనీల ఇంట‌ర్న్‌షిప్ అవ‌కాశాలు పొంద‌వ‌చ్చ‌ని తెలిపారు. అకాడ‌మి కోర్సుల‌ను బిటెక్ కోరు్స‌ల‌తోపాటు పూర్తి చేయ‌టం ద్వారా ఉన్న‌త ఉద్యోగావ‌కాశాలు ఇత‌రుల‌కున్నా ఎక్కువ వేత‌నం పొంద‌చ్చ‌ని తెలిపారు. రెడ్‌హ్యాట్ మేనేజ‌ర్ నిత్యానంద్ పాండా మాట్లాడుతూ విద్యార్ధులు ఆధునిక అంశాల‌ను అనుభ‌వ పూర్వ‌కంగా తెలుసుకోవ‌చ్చ‌న్నారు. విద్యార్ధుల‌కు ఎదుర‌య్యే అంశాల‌ను సానుకూల దృక్ప‌ధంతో చూడాల‌న్నారు. ఈసంద‌ర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్ధుల‌కు బ‌హుమ‌తులు అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో క‌న్వీన‌ర్‌ డాక్ట‌ర్ ఎ వీరాస్వామి, రెడ్‌హ్యాట్ సీనియ‌ర్ టెక్నిక‌ల్ క‌న్స‌ల్‌టెంట్‌ డి శ్రీ‌నివాస్ పాల్గొన్నారు.