Home ప్రకాశం కొనసాగుతున్న ఎల్ఐసి ఏజెంట్ల నిరసన

కొనసాగుతున్న ఎల్ఐసి ఏజెంట్ల నిరసన

483
0

చీరాల : ఎల్ఐసి ఏజెంట్లు ఈ నెల ఒకటవ తేదీనుండి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 4వరోజైన మంగళవారం కూడా మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా చేశారు. నెల్లూరు డివిజన్ లైఫ్ ఇన్సూరెస్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వివి సుబ్బారావు మాట్లాడారు. పాలసీ దారులకు బోనస్ పెంచాలని కోరారు.

పాలసీ దారులవద్ద వసూలు చేస్తున్న జిఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. ఏజెంట్లకు గ్రాట్యుటి పెంచాలన్నారు. ఏజెంట్లకు ఆరోగ్య భీమా అమలు చేయాలని కోరారు. తమ నిరసన కార్యక్రమాలు ఈ నెల 7 వరకు కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమంలో అమరా సుధాకర్, పిఎల్ స్వామి, వేణుబాబు, రఘు, జిఎస్క్ ప్రసాద్, గట్టి శ్రీను, డేగల శ్రీను పాల్గొన్నారు.