బాపట్ల : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ అభివృద్ధి కార్యక్రమాలను ఎంఎల్సి అన్నం సతీష్ ప్రభాకర్ మంగళవారం ప్రారంభించారు. కార్పొరేషన్ ద్వారా మంజూరైన వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన అనంతరం నియోజకవర్గంలో కార్పొరేషన్ ద్వారా మంజూరైన నిధులు, పథకాల లబ్ధిదారుల వివరాలు చెప్పారు.
వివిధ పధకాల ద్వారా పేద బ్రాహ్మణులకు 2015నుండి నేటి వరకు బాపట్ల నియోజకవర్గంలో భారతీ స్కీమ్ ద్వారా 214మంది విద్యార్దుల స్కాలర్ షిప్, చాణక్య పధకం, స్వయంఉపాధి ద్వారా 2016–2018లో 15మందికి, గరుడ పధకం, అంత్యక్రియలకు 2016 నుండి ఇప్పటి వరకు 21మందికి, కశ్యప పధకం,ఫించనులు 2016 నుండి నేటి వరకు 120మందికి, గాయత్రి పధకం, ప్రతిభాపురస్కారాలు 2016 నుండి నేటివరకు ఐదుగురికి అందజేశారు.