Home Uncategorized ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం పాదయాత్రలు ప్రారంభం

ప్రజా సమస్యల పరిష్కారానికి సిపిఎం పాదయాత్రలు ప్రారంభం

477
0

చీరాల : సిపిఎం ప్రజాపోరు యాత్ర చీరాల స్వర్ణ రోడ్డు గేట్ సెంటర్ నుండి ప్రారంభించారు. యాత్రను సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చీకటి శ్రీనివాసరావు ప్రారంభించారు. పాలక ప్రభుత్వాలు ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుని అధికారానికి వచ్చాక ప్రజల అవసరాలు వదిలేస్తున్నారని ఆరోపించారు.

సిపిఎం చీరాల ప్రాంతీయ కార్యదర్శి ఎన్ బాబూరావు మాట్లాడారు. చీరాలలో అర్హులైన పేదలకు నివేశన స్థలాలు ఇవ్వడమనేది ఎన్నికల ఆయుధంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. పట్టణంలో మురుగు సమస్య పరిష్కారానికి కుందేరు ఆదునికరించాలని కోరారు.

పాదయాత్రకు సిపిఐ కార్యదర్శి మేడా వెంకటరావు సంఘీభావం తెలిపారు. యాత్రలో సిపిఎం నాయకులు డి నాగేశ్వరరావు, ఎం వసంతరావు, డి నారపరెడ్డి, గోసాల సుధాకర్, రాజాలు, కె ఎల్లమంద, జి గంగయ్య, పి సాయిరాం, పి కిరన్, ఎల్ జయరాజు పాల్గొన్నారు.