Home ప్రకాశం సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ

సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ

1121
0

చీరాల : మాజీమంత్రి, ప్రజాపోరాట యోధులు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, పలాస ఎమ్మెల్యే గౌతు స్యాంసుందర్, రేపల్లె ఎమ్మెల్యే ఎ సత్యప్రసాద్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో లచ్చన్న చేసిన ఉద్యమ స్పూర్తి భావితరాలకు ఆదర్శవంతమన్నారు.

స్వాతంత్ర్య అనంతరం చట్టసభల్లో అనేక అభివృద్ధి పనులపై లచ్చన్న నిర్దిష్టంగా ప్రతిపాదనలు చేశారని చెప్పారు. అందుకే లాచాన్నను సర్దార్ గా చెప్పుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.