Home ప్రకాశం పేద‌ల సొంతింటి క‌ల నెర‌వేరుస్తాం : మంత్రి నారాయ‌ణ‌

పేద‌ల సొంతింటి క‌ల నెర‌వేరుస్తాం : మంత్రి నారాయ‌ణ‌

383
0

ఒంగోలు : రాష్ర్టంలో పట్టణ పేదల‌ సొంత ఇంటి కలను ప్రభుత్వం తీర్చబోతుందని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పీ నారాయణ అన్నారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని పట్టణ ప్రాంత ప్రజలకు నివాస గృహలు నిర్మించడానికి ఆయ‌న స్థ‌ల ప‌రిశీల‌న చేశారు. ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామాచర్ల జనార్దన్ రావు, కలెక్టర్ వీ వినయ్‌చంద్‌, క‌మీష‌న‌ర్ ఎస్ వెంక‌టకృష్ణ‌తో క‌లిసి స్థలాలను పరిశీలించారు. ఒంగోలు రవాణా శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న 3ఎకరాల భూమిని పరిశీలించారు.

ఎర్రజర్ల గ్రామంలో 232 ఎకరాలు భూములను పరిశీలించారు. ఎర్రజర్లలో 100 ఎకరాలు ట్రిబుల్ ఐటీ, యూనివర్సిటీకి, 100 ఎకరాలు గృహ నిర్మాణాలకు, 32ఎకరాలలో స్టేడియం నిర్మాణం చేపట్టాలన్నారు. కొత్తపట్నం మండలం చింతల గ్రామంలో గృహలు నిర్మించడానికి గుర్తించిన స్థలాన్ని చూశారు. ఒంగోలు నగరానికి చెందిన10 వేల మంది ప్రజలు గృహలు నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామ‌ని ఎమ్మెల్యే దామాచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు నగరంలో ఎక్కువ మంది ప్రజలు గృహనిర్మాణం కోసం మీసేవా ద్వారా అర్జీలు ఇస్తున్నారన్నారు. ఆదివారం ప్రమాదం శాత్తూ ఒంగోలు సమ్మర్ ట్యాంకులో పడి మరణించిన వారి మృతదేహాని మున్సిపల్ మంత్రి పీ నారాయణ, ఒంగోలుఎమ్మెల్యే జ‌నార్ధ‌న్‌, కలెక్టర్ విన‌య్‌చంద్‌ సందర్శించారు. కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ కె శ్రీనివాసరావు, తహసీల్దార్ చిరంజీవి పాల్గొన్నారు.