చీరాల : సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన ఇఎస్ఎఫ్ ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదిరినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఐఎస్ఎఫ్ దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైమ్ ఇనివిస్టిగేషన్ సంస్థని, అలాంటి సంస్థతో ఒప్పదం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి రవికుమార్ పేర్కొన్నారు. ఇఎస్ఎఫ్ సంస్థ వ్యవస్థాపకులు, ఛైర్మన్ ఎ ఆంజనేయులు మాట్లాడారు. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, ట్రైనింగ్ అండ్ కన్సల్‌టెన్సీ, ప్రివెంటివ్ టెస్టింగ్ కార్యక్రమాల్లో విద్యార్ధులు పాలుపంచుకోవచ్చని తెలిపారు. తమ కంపెనీ నిర్వహించే సైబర్ సెక్యురిటీ సర్టిఫికేట్ కోర్సులను కళాశాల విద్యార్ధులకు నిర్వహిస్తారని తెలిపారు. సైబర్ క్రైమ్ మీద పరిశోధనలలో కళాశాల విద్యార్ధులు పాలుపంచుకోవచ్చని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ హెచ్ఒడి డాక్టర్ పి హరిణి తెలిపారు. ఒప్పందం పంట్ల అధ్యాపకులు, విద్యార్ధులు హర్షం వ్యక్తం చేశారు.