Home ప్రకాశం సంస్కృత అధ్యాప‌కులు ర‌ఘునాధ‌రెడ్డికి ఉద్యోగ‌విర‌మ‌ణ అభినంద‌న స‌భ‌

సంస్కృత అధ్యాప‌కులు ర‌ఘునాధ‌రెడ్డికి ఉద్యోగ‌విర‌మ‌ణ అభినంద‌న స‌భ‌

361
0

చీరాల : విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ క‌ళాశాల సంస్కృత అధ్యాప‌కులు కుంచాల ర‌ఘునాధ‌రెడ్డి ఉద్యోగ విర‌మ‌ణ అభినంద‌న స‌భ క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో మంగ‌ళ‌వారం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా క‌ళాశాల సెక్ర‌ట‌రీ అండ్ క‌ర‌స్పాండెంట్ అడ్డ‌గ‌డ వేణుగోపాల్ మాట్లాడుతూ సంస్కృత అధ్యాప‌కులు ర‌ఘునాధ‌రెడ్డి యువ ఉపాధ్యాయుల‌కు స్పూర్తిదాయ‌క‌మ‌న్నారు. 32సంవ‌త్స‌రాలు స‌వేలందించి ఉద్యోగ విర‌మ‌ణ చేస్తున్న సంద‌ర్భంగా అభినందించారు. ప్రిన్నిపాల్ మ‌న్నేప‌ల్లి బ్ర‌హ్మ‌య్య మాట్లాడుతూ రాజీలేని క్ర‌మ‌శిక్ష‌ణ‌తో విద్యాబోధ‌న చేశార‌ని చెప్పారు. స‌భ‌లో రిటైర్డు అధ్యాప‌కులు వి పూర్ణ‌చంద్ర‌రావు, పి గోపినాద్‌, సిహెచ్ ర‌వీంద్ర‌నాద్‌, అధ్యాప‌కులు టి సాంబ‌శివ‌రావు, వై సుబ్బారాయుడు, టి పోల‌య్య‌, గుంటి వెంక‌టేశ్వ‌ర్లు, ఎల్‌జె నాయుడు పాల్గొన్నారు.