చీరాల : ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో చీరాల ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్ ప్రతిష్టాత్మకంగా జెడ్‌పి ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. పాఠశాలను 40రోజుల్లో నిర్మాణం పూర్తి చేసి తరగతులు ప్రారంభించేందుకు సిద్దం చేశారు. పాఠశాలకు అవాంతరాలు సృష్టించినప్పటికీ న్యాయస్థానంలోనూ పోరాటం చేసి విజయం సాధించారు. పాఠశాల నిర్వహణకు ఉన్న అడ్డంకులు తొలగి సజావుగా పాఠశాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదీనంలోనే విద్యావ్యవస్థ ఉంటేనే పేదలకు సరైన చదువులు అందుతాయన్న ఆమంచి సంకల్పం ఫలించింది. 1400మంది విద్యార్ధులు పాఠశాలలో చేరారు. వీరందరిలో ఎంఎల్ఎ ఆమంచి కృష్ణమోహన్ తనయుడు ఒకరుగా చదువుతున్నారు.
ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసేందుకు డిప్యుటేషన్‌పై వచ్చారు. పాఠశాలలో మద్యాహ్న భోజనం నాణ్యంగా అందించేందుకు, అదనంగా విద్యార్ధులకు భోజన సౌకర్యం కల్పించేందుకు, రవాణ, ఇతర సౌకర్యాలు కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా అందించేందుకు పాఠశాలకు అనుబంధంగా గ్రామ పెద్దలతో ట్రస్టును ఏర్పాటు చేశారు. ట్రస్టు నిర్వహణకు తన వంతుగా రూ.5లక్షల విరాళం అందజేశారు. ఆయన తోపాటు ఇతర పెద్దలూ విరాళాలు అందజేశారు. పాఠశాలలో మద్యహ్న భోజనం ప్రారంభించారు. ఈసందర్భంగా పాఠశాల ఆవరణలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు. వందమంది విద్యార్ధినులకు సైకిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మున్సిపల్ ఛైర్మన్ మోదడుగు రమేష్‌బాబు, కౌన్సిలర్ గుద్దంటి సత్యనారాయణ, వేటపాలెం ఎంపిపి బండ్ల తిరుమలాదేవి, టిడిపి చీరాల మండల అధ్యక్షులు బుర్ల మురళి, గట్టు సుబ్బారావు పాల్గొన్నారు.