Home సినిమా విక్ర‌మ్ స‌ర‌స‌న త్రిష స్థానంలో ఐశ్వ‌ర్య‌రాజేష్‌

విక్ర‌మ్ స‌ర‌స‌న త్రిష స్థానంలో ఐశ్వ‌ర్య‌రాజేష్‌

516
0

చెన్నై: విక్రం స‌ర‌స‌న  త్రిష స్థానంలో ఐశ్వ‌ర్య‌రాజేష్ న‌టిస్తున్నారు. విక్రం, త్రిష‌ జంటగా 15 ఏళ్ల క్రితం హరి దర్శకత్వంలో వ‌చ్చిన‌ ‘సామి’ చిత్రానికి సీక్వెల్‌గా స్వామి స్క్వైర్ రూపొందిస్తున్నారు. అప్ప‌ట్లో స్వామి చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దానికి సీక్వెల్‌గా తీసిన‌ ‘సామి స్క్వేర్‌’ చిత్రంలో త్రిష, కీర్తిసురేష్‌ నటించనున్నట్లు తొలుత ప్రకటించారు. కొన్ని కారణాలతో ఈ ప్రాజెక్టు నుండి త్రిష వైదొలిగారు.

త్రిష త‌న‌ కన్నా కీర్తిసురేష్‌కే ఎక్కువ సన్నివేశాలు ఉన్నాయనే కార‌ణంతోనే ఇలా చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కువ పారితోషకం ఇవ్వడానికి కూడా నిర్మాత శిబు తమీన్స్‌ ముందుకొచ్చినప్ప‌టికీ త్రిష నిరాకరించినట్లు సమాచారం. దీంతో ఆమె పాత్రకు ఐశ్వర్యా రాజేష్‌ను ఎంచుకున్నారు. విక్రం, ఐశ్వర్యా రాజేష్‌కు సంబంధించిన సన్నివేశాలను ఇటీవలే తెరకెక్కించారు. ఐశ్వర్య చిన్న పాత్ర పోషించినప్పటికీ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపిస్తారని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఆగస్టులో ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.